Advertisement

Does Roja have the ability to handle that position? | Shaili & Shaili TV

Does Roja have the ability to handle that position? | Shaili & Shaili TV #APCMJAGAN #RKJOJA #APPoltics
By Shaili & Shaili
రోజా కు జగనన్న ఊహించని బహుమతి .
నిజంగా రోజా కు ఏపీ ఐ ఐ సి చైర్మన్ పదవి లభించడం గొప్ప అదృష్టమని చెప్పాలి .
మంత్రి వర్గంలో చోటు లభించలేదని రోజా అలిగి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా
డుమ్మా కొట్టేసింది . దీనిపై మీడియా లో అనేక కథనాలు వచ్చాయి . వైసిపి లో రోజా కస్టపడి పనిచేసింది ,
అవమానాలు ఎదుర్కొంది , అవహేళనలు భరించింది . జగనన్న ముఖ్యమంత్రి కావాలి అనే సంకల్పంతో పోరాటం
చేసింది . అలాంటి రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు . కానీ జగన్ ఆమెను మంత్రి మండలిలోకి తీసుకోలేదు. రోజాతో పాటు మరి కొందరు కూడా నిరాశ పాడారు .
అయితే రోజా మీద మీడియా లో కథనాలు చూసిన జగన్ ఆమెను అమరావతి
పిలిపించుకొని మంగళవారం నాడు మాట్లాడారు . ఊహించని విధంగా బుధవారం నాడు ఏపీ ఐ ఐ సి చైర్మన్ గా అపాయింట్ చేశారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కొత్తగా ఏర్పడింది . ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత వుంది .
రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాము అని వచ్చేవారికి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ సంస్థదే.
కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన , అభివృద్ధి చాలా ముఖ్యమైనవి , ఎంతో భాద్యతాయుతమైఈ పదవి .
రోజాలాంటి మహిళకు ఈ పదవి అప్పగించడం జగన్ కు రోజా మీద వున్న నమ్మకానికి నిదర్శనం .
ఇంతకాలం రోజా అంటే సినిమా నటి , జబర్దస్త్ జడ్జి అనే భావన పోగొట్టుకొని తన సత్తా , సామర్ధ్యం నిరూపించుకొనే అవకాశం
వచ్చింది ... రోజాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఓ ఛాలెంజ్

Jaganmohan Reddy,RK Roja,APIIC Chairman,

Post a Comment

0 Comments